”దిశ” గ్యాంగ్ రేప్, హత్య జరిగిన రోజు నుంచే ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలంటే…బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే నిందితులను కొట్టి చంపాలని కొందరు, తమకు అప్పగిస్తే సరైన గుణపాఠం చెబుతామని మరికొందరు…ఉరి తీయాలని ఇంకొందరు… రకరకాల అభిప్రాయాలను బహిరంగంగా, సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
గొయ్యి తవ్వేశారు… ఈ రాత్రికే
అలాగే తెలుగు సినిమా స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్ అభిమానులకు చెందిన కోన ప్యాన్ క్లబ్ కూడా వారికి సరైన శిక్ష విధించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో విజ్ఞప్తి చేసింది. శిక్ష ఎలా విధించాలో కూడా సూచించింది. సరిగ్గా కోన ప్యాన్ క్లబ్ సూచించిన ప్రకారమే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఎంతమందిని ఇలా ఎన్‌కౌంటర్ చేస్తారు: మంచు లక్ష్మి
కోన ఫ్యాన్ క్లబ్ ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేసిందంటే..
సార్..నిజంగా మీరు వాళ్లను శిక్షించాలనుకుంటే… నిందితులను నేర స్థలానికి తీసుకెళ్లండి….”దిశ” ను తగులబెట్టిన చోటే సీన్ రికన్ స్ట్రక్షన్ చేయండి. తప్పకుండా వాళ్లు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వారిని కాల్చివేయడం తప్ప మన పోలీసులకు వేరే మార్గం ఉండదు…ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి.
ఈ ఎన్ కౌంటర్ కాకతాళీయమే అయినప్పటికీ కోన ప్యాన్ క్లబ్ స్క్రిప్ట్ కు సరిగ్గా మ్యాచయ్యింది.
Advertisements
ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే…: సీపీ సజ్జనార్