చత్తీస్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాందే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బదులుగా గంజాయి, బంగ్ లను ప్రోత్సహిస్తే హత్యలు, అత్యాచారాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
మార్వాహి జిల్లాలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… మద్యానికి బానిసైన వారు ఎక్కువగా హత్యలు, అత్యాచారం, దోపీడీలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల మద్యానికి బదులు గంజాయి, బంగ్ ను ప్రోత్సహిస్తే ఆ నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గతంలో తాను అసెంబ్లీలో లేవనెత్తినట్టు చెప్పారు. జూలై 27న జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తుతానని చెప్పారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్దాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే… గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.