భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో 3 రోజులపాటు సాగిన సహస్ర కళాశాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పవిత్ర గోదావరి నదీ జలాలను,పంచామృతాలతో ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు.
సహస్ర కలశాలలో దేవతలను ఆవాహనం చేసిన పిదప స్వామివారికి తిరుమంజనం,పుణ్యాహవచనం,విశేష స్నపనం నిర్వహించిన పిదప పంచామృతాలతో సహస్ర కలశాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సహస్ర కళాశాభిషేకం స్వామివారికి ఘనంగా నిర్వహించారు.3రోజులపాటు సాగిన ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేశారు.తిరిగి సోమవారం ఉదయం స్వామివారి నిత్యకళ్యాణం యధావిధిగా నిర్వహిస్తారు.