ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ కు చెందిన రూ.78 కోట్ల విలువ గల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్, వీడియో కాన్ గ్రూప్ మనీలాండరింగ్ సంబంధించిన కేసులో చందాకొచ్చర్ పై దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో కొచ్చర్ కు చెందిన ముంబై అపార్ట్ మెంట్ తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన కంపెనీ ఆస్తులను కూడా ఈడీ ఎటాచ్ చేసింది.