సీన్లోకి ఈడీ! - enforcement directorate going to arrest megha krishna reddy in illegal asset case- Tolivelugu

సీన్లోకి ఈడీ!

మెఘా ఇంజనీరింగ్ సంస్థపై, మెఘా కృష్ణారెడ్డిపై రెండ్రోజులుగా సాగుతోన్న ఐటీ దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ సోదాల్లో వేల కోట్ల అంశాలపై లెక్కలు తేలాల్సి ఉండటం, హావాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు ఐటీ అనుమానంగా ఉండటంతో… ఈడీ రంగంలోకి దిగనుంది.

ప్రస్తుతం జరుగుతోన్న సోదాలు మరో రెండు-మూడు రోజులు కొనసాగే అవకాశం కనపడుతోంది. అయితే, ఈ సోదాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఐటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ హవాలా మనీ చేతులు మారిందని ఇప్పటికే ఐటీ ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మొత్తం వ్యవహరంలో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది. వేల కోట్ల నిధులు ఎటు నుండి ఎటు వెళ్లాయి, ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది, సూట్‌ కేసు కంపెనీల లెక్కలతో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఐటీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

రెండ్రోజుల సోదాల్లో… ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, ఇంకా వేల కోట్ల అంశాలపై సమాధానం రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ సీన్లోకి ఎంటరై… దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోంది. అయితే… ఇప్పటికే సేకరించిన ఆధారలతో… మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశంలో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp