మెఘాపై ఆరు రోజుల ఐటీ దాడులు జరిగాయి. సంచుల కొద్ది డాక్యుమెంట్లు, డబ్బాల కొద్ది బంగారు-వజ్రాభరణాలు సీజ్ చేశారు. ఆధారాలు కూడా వచ్చేశాయి. కానీ ఆ తర్వాత మెఘా ఎక్కడున్నారు…? మెఘా దాడుల్లో ఐటీకి ఎం లభించాయి…? రెండు రోజులుగా మెఘా ఎక్కడున్నారు…? ఐటీ అదుపులోకి తీసుకుందా…? ఐటీ ఫిర్యాదుతో ఈడీ ఎంటరైందా…?
పై ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరుకుతోంది. తొలివెలుగు ఇదే అంశంపై పలువురిని ప్రశ్నిస్తే… మెఘా కృష్ణారెడ్డి ఎక్కడున్నారనే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఫండింగ్‌పై ప్రశ్నించినట్లు సమాచారం. అందుకే మెఘా సోదాల తర్వాత ఐటీ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తరలించినట్లు తెలుస్తోంది. మెఘా సోదాల్లో లభ్యమైన ఆధారాలను బట్టి చూస్తే… ఇదే కీలక అంశమని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. అందుకే ఆరో రోజు సోదాల అనంతరం మెఘాను ఢిల్లీకి తరలించినట్లు ఢిల్లీ నుండి జర్నలిస్ట్ వర్గాలు తెలిపాయి. అక్కడ నుండి హైదరాబాద్‌కు తీసుకొచ్చి, మరోసారి ఢిల్లీకి తరలించగా… ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, శుక్రవారం రాత్రి మరోసారి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, దీనిపై ఈడీ వర్గాలు కానీ, ఐటీ వర్గాలు కానీ అధికారికంగా స్పందించ లేదు. అయితే, మెఘా కృష్ణారెడ్డి ఎక్కడున్నారు, ఐటీ సోదాల తర్వాత ఏమైయ్యారు…? అన్న ప్రశ్నలు మాత్రం రెండ్రోజులుగా వినిపిస్తున్నాయి.