ప్రతిపక్షాలపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మొదట్నుంచి ఉన్న ఆరోపణలే. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇవి జరిగాయనేది బీజేపీ వాదన. కాకపోతే ప్రస్తుతం ఉన్నంత రేంజ్ లో సోదాలు, అరెస్టులు కొనసాగలేదు. ఈక్రమంలోనే బీజేపీ సర్కార్ పై ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం వెనకడగు వేయడం లేదు.
తాజాగా.. ఈడీని మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనలో మార్పులు చేసింది కేంద్రం. రాష్ట్ర పోలీస్ విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఇకపై ఈడీ కోరిన ఏ సమాచారాన్ని అయినా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. విదేశాంగశాఖ, ఎన్ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకొచ్చింది బీజేపీ సర్కార్.