మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌజ్‌కు అక్రమ నీటి మళ్లింపుపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో అధికారులు కదలివచ్చారు. అధికార పార్టీ నేత చేసిన అక్రమాన్ని.. త్వరగా సక్రమం చేసే పనిలోపడ్డారు. వివాదాస్పద కాలువ ఇన్నాళ్లు మట్టిదిగా ఉండగా.. ఆఘమేఘాల మీద ఇప్పుడు దాన్ని సిమెంట్‌తో నిర్మించేస్తున్నారు.
కాళేశ్వరం నీటితో ఇప్పటివరకు చెరువులను మాత్రమే నింపాలని లక్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. కానీ రసమయి ఫాం హౌస్ విషయంలో మాత్రం నిబంధనలు మారాయి. మార్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం పరిధిలోని ఏ ప్యాకేజీ పనులలో కూడా లేని విధంగా.. ఫాం హౌస్ దగ్గరలోని రైతులకు సంబంధించిన160 ఎకరాలకు నీటిని ఇచ్చేందుకు అనుమతులు వచ్చేశాయి. ఇంకే ముంది బెజ్జంకి మండలం గుండారం దగ్గరున్న అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వచ్చే డీ–7 కెనాల్‌కు పిల్ల కాలువ పుట్టుకొచ్చింది. . పైగా జాన్ నెలలో కాలువ తవ్వితే.. నవంబర్‌లో దానికి టెండర్ ఖరారు కావడం విశేషం.
ఇదిలా ఉంటే కాలువతో భూమిని కోల్పోయిన రైతులకు ఇంతవరకు పరిహారమే అందలేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేత కావడంతో భయంతో వారు నోరు మెదపడం లేదని ఇతర రైతులు చెప్పుకుంటున్నారు. పైగా బెజ్జంకి మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీతో సహా చాలా మంది ప్రజాప్రతినిధులు దళిత సామాజికవర్గానికే చెందిన వారు కావడంతో.. ఎదురించిన వారిపై sc, st అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నట్టగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.