చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ దూకుడు పెంచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్… భారీ స్కోరు వైపు పరుగులు పెడుతుంది. ఫస్ట్ డే సెంచరీ కొట్టిన కెప్టెన్ జోరూట్… రెండో రోజు తన ప్రతాపాన్ని చూపాడు. తన 100వ టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.
జోరూట్ కు ఇది 5వ డబుల్ సెంచరీ కావటం విశేషం. అంతకు ముందు రూట్ తో కలిసి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రమాదకరంగా మారాడు. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచుతున్నట్లు కనిపించిన స్టోక్స్ ను నదీం బోల్తా కొట్టించాడు. దీంతో స్టోక్స్ 82పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. రూట్ తో కలిసి నాలుగో వికెట్ కు 124పరుగుల భాగస్వామ్యం అందించాడు.
Congratulations to @ECB_cricket Captain @root66 on his fine double hundred in his 100th Test! @Paytm #INDvENG
Details – https://t.co/IEc86nzIZz pic.twitter.com/0uhTR3FnvQ
— BCCI (@BCCI) February 6, 2021
ఇంగ్లాండ్ ప్రస్తుతం 454పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో రూట్ తో పాటు పోప్ ఉన్నారు.