టీంఇండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లిపై ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో విరాట్ అతిగా అప్పీలు చేస్తూ… ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను ఔట్ ఇవ్వాలన్నట్లుగా అంపైర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. రహానె అద్భుత కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సిరీస్ను గెలుపొందిన తర్వాత కోహ్లీ ఒత్తిడికి లో ఉన్నాడని డేవిడ్ యూకే డైలీ మెయిల్లో రాసుకున్నాడు.
కోహ్లి నాలుగో రోజు అతిగా అప్పీల్ చేశాడు. మిడిల్ సెషన్లో రెండు షాకింగ్ సమీక్షలు కోరాడు. దీనిపై వ్యాఖ్యాతలూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను మాత్రం అంపైర్లను ప్రభావితం చేయడానికే భారత కెప్టెన్ ఇలా చేశాడని భావిస్తున్నాను అంటూ ప్రకటించాడు.
చెన్నై టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 39/1తో నిలిచింది. చివరిదైన ఐదో రోజు విజయానికి మరో 381 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్ ప్రారంభం కాగానే భారత్ కీలకమైన రెండు వికెట్లను చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో ఉంది.