భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఇంగ్లాండ్ లో క్వారెంటైన్ తప్పనిసరి చేశారు. ఈ క్వారెంటైన్ నిబంధనలు సరికాదని, ఒక్క భారత్ కే ఇలాంటి నిబంధన పెట్టడం అంటే తమపై ఇది వివక్షే అంటూ భారత్ ఇంగ్లాండ్ పై నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు మీరు నిబంధనలు మార్చకపోతే భవిష్యత్ లో మా నిర్ణయాలు కూడా కఠినంగా ఉంటాయని భారత్ హెచ్చరించింది.
భారత్ తీవ్రంగా స్పందించిన మరుసటి రోజే ఇంగ్లాండ్ కీలక ప్రకటన చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సి్న్ తీసుకున్న వారిని అధికారికంగా గుర్తిస్తామని, ట్రావెల్ పాలసీలో కోవిషీల్డ్ ను చేర్చుతున్నట్లు తెలిపింది. దీంతో ఇండియా నుండి ఇంగ్లాండ్ వెళ్లే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి క్వారెంటైన్ ఉండదు. భారత్ లో అనుమతి ఉన్న ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది.
ఇంగ్లాండ్ నిర్ణయంపై ఇండియా హర్షం వ్యక్తం చేసింది.