మాంచెస్టర్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐదవ టెస్ట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు క్రికెట్ ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దానికి కారణం ఈ మ్యాచ్ లో కూడా కరోనా కలకలం రేపడమే. మాంచెస్టర్ లో జరిగే ఐదవ టెస్ట్ సందర్భంగా ఆటగాళ్లకు, వారి సిబ్బందికి తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.
గత వారం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ ఆర్ శ్రీధర్ ర్ ల కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని టీం ఇండియా వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ లండన్లోని ఓవల్ లో జరిగిన నాలుగో టెస్టు కోసం భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టారు. అప్పుడు డు కూడా అ వార్త సన్నిహితంగా మెలగడం తో ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు క్వారంటైన్ లో ఉన్నారు.
Advertisements
తాజాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది లోని సహాయక సిబ్బందిలో భాగమైన ఫిజియో యోగేష్ ఫర్మర్ కు కరోనా సోకినట్టు బుధవారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో తేలింది. మొదటి టెస్టులో భారత ఆటగాళ్లు అందరూ కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. మరో రౌండ్ కూడా పరీక్షలు చేయించగా అందులో ఒకరికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక సోమవారం టీమిండియా మాంచెస్టర్ చేరుకుంది. మంగళవారం బుధవారం ట్రైనింగ్ సెషన్ జరిగినప్పటికీ ఫైనల్ సెషన్ మాత్రం క్యాన్సిల్ అయింది.