టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సామ్ తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. ఇందులో ‘యశోద’ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రాన్నిహరిశంకర్, హరీశ్ నారాయణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో బారి అంచనాలు రేకెత్తించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో మరిన్నీ అంచనాలు పెంచేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో సమంత లుక్ అదిరిపోయింది.
ఆసుపత్రి బెడ్‌పై సమంత ఉన్న సీన్‌తో 36 సెకండ్ల యశోద సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. హాస్పిటల్ బెడ్‌పై కళ్లు తెరిచిన సమంత.. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. చేతికి ఉన్న బ్యాండ్ చూసుకుని.. నెమ్మదిగా బెడ్‌పై నుంచి కిందికి దిగి బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వస్తుంది. కిటికీలోంచి చేయి పెట్టి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో వీడియో పూర్తవుతుంది.
Here's the engrossing glimpse of @Samanthaprabhu2's #Yashoda 🕊💥
Telugu: https://t.co/lp8k4hPAnp
Hindi: https://t.co/iwp9W7trMH
Kannada:https://t.co/ho25Le4qEu
Tamil:https://t.co/Tw2iEW5j5Y
Malayalam:https://t.co/cRNMS1JJtn pic.twitter.com/6Mjv34wX16— Aditya Music (@adityamusic) May 5, 2022
వైట్ కలర్ డ్రెస్సులో అమాయకపు చూపుతో సామ్ చాలా బాగుంది. యశోదలో సామ్ మరోసారి తన నటనా విశ్వరూపంను ప్రదర్శించనున్నట్లు గ్లింప్స్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. బెడ్‌పై సమంత ఎందుకు ఉండాల్సి వచ్చింది..? చేతికి ఉన్న బ్యాండ్ ఏంటి..? అసలు ఏమైంది అనేది ఆగస్టు 12 వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి.
Advertisements