అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందులో ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు పోలీసులు. అయితే నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ఎనోచ్ నగరంలో 8 వేల మంది నివసిస్తారు. ఉటా రాజధాని స్టాల్ లేక్ సిటీకి ఈ నగరం 245 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.