ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన కౌంటర్ దాఖలు చేశారు. అయితే వాదనలు వినిపించేందుకు విజయసాయి రెడ్డి న్యాయవాది కొంత సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది కోర్టు.
మరోవైపు విజయసాయి బెయిల్ రద్దు అంశాన్ని కోర్టు నిర్ణయానికే వదిలేసింది సీబీఐ. ఇందుకు సంబంధించి గతంలోనే మెమో దాఖలు చేసింది. కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.