సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఫలానా హీరోయిన్, ఫలానా హీరోతో కలిసి చేసిన సినిమాలన్నీ హిట్టే అనేది కొట్టిపారెయ్యలేని అంశం. వాళ్ళద్దర్నీ ప్రేక్షకుడు ఓన్ చేసుకున్నాడని అర్థం. ఇంకో విధంగా చూస్తే నటీనటుల కెమిస్ట్రీకావొచ్చు. వాళ్ళ అండర్ స్టాండింగ్ కావొచ్చు వాళ్ళద్దరి మధ్య ఉండే స్నేహభావం కావొచ్చు సినిమా డిమాండ్ చేసే ఏ భావోద్యాగాలైనా పండుతాయి. సినిమా దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి,యూనిట్ కి సంబంధించిన తలనొప్పులు తగ్గుతాయి.
ఆమేరుకు సెట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆడుతూ పాడుతూ సినిమా కంప్లీట్ అవుతుంది. ఒకసారి హిట్టయ్యాకా మళ్లీ వారి కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ చాలా మంది ప్రేక్షకుల్లో కలుగుతుంది.
అలా టాలీవుడ్లో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జంటల్లో వెంకటేశ్- భూమిక జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా…వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.దాదాపు 20 సంవత్సరాల క్రితం..2002లో వెంకీ, భూమిక.. వాసు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. వీరి కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుందని అంతా భావించారు. కానీ.. ఆ తర్వాత వీరు జంటగా నటించే అవకాశం రాలేదు.
తాజాగా వీరి కాంబినేషన్ గురించి లేటెస్ట్గా ఓ క్రేజీ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత వెంకటేశ్ భూమిక జంటగా ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. కాకపోతే.. ఈసారి హీరోహీరోయిన్ క్యారెక్టర్స్లో మాత్రం కాదు. వేరే హీరో సినిమాలో వీరిద్దరూ జంటగా మెరవనున్నట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి వెంకీ, రానా, జగపతిబాబు కూడా నటిస్తున్నారు.
ఇటీవలే మేకర్స్ ఈ సినిమా నుంచి బిల్లీ బిల్లీ అంటూ కొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సర్ప్రైజింగ్గా ఈ సాంగ్లో వెంకీకి జోడీగా భూమిక ప్రత్యక్షమైంది. ఈ సాంగ్లో వీరిద్దరూ జంటగా స్టెప్పులు వేస్తూ కనిపించారు.
దీంతో వెంకీ, భూమిక వేసిన డ్యాన్సులు చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరూ జంటగా కనిపించనున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు జంటగా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.