కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎంతమంచివాడవురా. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రిన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్, టీజర్ తో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈనెల 19 న ఉదయం 11గంటల 9 నిమిషాలకి, ‘అవునో తెలియదు .. కాదో తెలియదు’ అనే పాటను విడుదల చేయనున్నారు.
కొత్త సంవత్సరంలో గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, బంధాల మధ్య వస్తున్న ఎంతమంచివాడవురా సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. శతమానంభవతి సినిమాతో శర్వానంద్ కు మంచి హిట్ ఇచ్చిన సతీష్ మరి ఈ సారి ఏమి చేస్తాడో చూడాలి.