నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జనవరి 8 న హైదరాబాద్ లోనే నిర్వహించాలని ఎంత మంచివాడవురా చిత్ర యూనిట్ నిర్ణయించింది.
అయితే ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతారని సమాచారం. ఒకవేళ నిజంగా ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపిస్తే నందమూరి అభిరామానులకు పండగే అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ కు పోటీగా సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు, అలవైకుంఠపురంలో సినిమాతో అల్లుఅర్జున్ కూడా ఉన్న సంగతి తెల్సిందే.