కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల విజయాన్ని 2024లో బీజేపీ పునారావృతం చేయలేదని ఆయన అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 50 సీట్లను కోల్పోతుందని చెప్పారు. కేరళ లిట్రేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ…..
ఇప్పటికీ బీజేపీ ఆధిపత్యమే ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు కోల్పోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ పార్టీ కోల్పోవడం పెద్ద అసాధ్యమేమీ కాదని తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీ చాలా సీట్లు గెలుచుకుంది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు అన్ని సీట్లను గెలిచిందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ కొన్ని సీట్లలో విజయం సాధించిందన్నారు. టీఎంసీ కంచుకోట బెంగాల్‌లోనూ ఆ పార్టీ 18 సీట్లను గెలిచినట్లు వెల్లడించారు.
కానీ 2024లో ఆ విజయాలను బీజేపీ నమోదు చేయలేదన్నారు. పుల్వామా దాడులు, బాలా కోట్ స్ట్రైక్స్ చివరి నిమిషంలో బీజేపీకి భారీ మెజారిటీ తీసుకు వచ్చాయన్నారు. 2024 ఎనికల్లో ఆ విజయం పునరావృతం కాదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ భారీగా తగ్గిందన్నారు.