ప్లాస్టిక్ కవర్స్ వాడటం వల్ల పర్యావరణానికి ఎంతో హానికరమో అందరికీ తెలుసు. అయినా కవర్స్, ప్లాస్టిక్ వాడటం మన నిత్య జీవితంలో కామన్ అయిపోయింది. కవర్ వాడుకోవద్దని తెలిసినా… ఇంటి నుండి కవర్ తీసుకెళ్లటం మర్చిపోతాం. మరో కవర్ కొంటాం… ఇలా ఎప్పుడూ జరిగేదే. కానీ పర్యావరణ ప్రేమికులు దీనికి విరుగుడు ఆలోచించారు. అచ్చం పర్స్‌లాగా ఉండే ఓ క్యారీ బ్యాగ్‌ను రెడీ చేశారు. పైగా జ్యూట్ బ్యాగ్ కావటంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. మనీ పర్స్ కాబట్టి అది లేకుండా బయటకు వెళ్లలేం. సో… ఇంట్లో బ్యాగ్ మర్చిపోయా అనే బెంగా ఉండదు.
ప్లాస్టిక్ వద్దు-జ్యూట్ బ్యాగ్ ముద్దు అంటూ ప్రకృతి ప్రేమికులు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.