హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రాక్టీస్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఒకటి టర్నింగ్ దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టింది.
దీంతో నిర్వాహకులు ప్రాక్టీస్ రేసుకు విరామం ప్రకటించారు. ఈ నెల 11,1 2 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సాగర తీరం దగ్గర ట్రాక్ ను రెడీ చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే సాగర తీరం చుట్టు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
అంతర్జాతీయస్థాయి ఈవెంట్ కావడంతో దానికి తగిన స్థాయిలో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారు రేసును చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రేక్షకులతోపాటు పోటీల్లో పాల్గొనేందుకు పలు సంస్థలు, రేసర్లు పెద్దఎత్తున హైదరాబాద్ కు వస్తున్నారు.
అంతకు ముందు ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు వచ్చాయి. దీంతో ప్రాక్టీస్ రేస్ వాయిదా పడింది. ట్రాక్ పైకి సాధారణ వాహనాల అనుమతి లేకున్నా ఎలా వచ్చాయని నిర్వాహకులు ఆందోళన చెందారు. ప్రాక్టీస్ సమయంలో సాధారణ వాహనాలను ట్రాక్ పైకి అనుమతించిన కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.