ఎర్రబెల్లి దయాకర్, తెలంగాణ మంత్రి
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాల రాసేలా మోడీ సర్కార్ ప్రవర్తిస్తోంది. విభజన చట్టంలో కల్పించిన హక్కు బయ్యారం ఉక్కు.
70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏం చేశాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళన చేస్తామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టం.
దేశ రాజకీయాలను కేసీఆర్ ఏలుతారనే భయంతోనే తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేపడతాం.
దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీని తరిమేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు.