యధా రాజా తధా ప్రజ అన్నట్టు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల తీరు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల ఒ మహిళ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన మరువకముందే తాజాగా.. ఆయన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హన్మకొండ జిల్లాలోనే అధికార పార్టీ నేత బరితెగించారు.
కమలాపూర్ మండలం గోపాల్ పూర్‌లో మహిళ DLPO ను పరుష పదజాలంతో దూషించారు టీఆర్ఎస్ సర్పంచ్, ఆయన సోదరుడు. తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ అధికార మదాన్ని ప్రదర్శించారు. మహిళా అధికారిని వారు తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోను చూసిన వారంతా టీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. మహిళా అధికారులు అంటే చులకనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధులనా తాము ఎన్నుకున్నది అని ఫైర్ అవుతున్నారు. టీఆర్ఎస్ నేతల తీరుకు నిరసనగా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.