వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా విరుచుకు పడ్డారు. మానసిక ఒత్తిడికి గురై ప్రజలను నాయకులను దూషించడం సరికాదని నరేందర్ కు ఆయన హితవు పలికారు.
తన అండతోనే నరేందర్ ఎమ్మెల్యే అయ్యాడని ఆయన గుర్తు చేశారు. నరేందర్ తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి అనవసరంగా వ్యక్తిగత దూషణలకు పోకూడదని ఆయన సూచించారు.
శాసన సభ్యుడిగా నరేందర్ ఎన్నికైన తర్వాత తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పతన్నా విడుదల చేయలని ఆయన డిమాండ్ చేశారు.
లేని పక్షంలో దీనిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. టీఆర్ఎస్ లో కొనసాగేది లేనిది రేపు మధ్యాహ్నం వరకు చెబుతానని ఆయన చెప్పారు.
టీఆర్ఎస్ వల్ల తనకు, తన అనుచరులకు ఎలాంటి లబ్ధి జరగలేదన్నారు. పార్టీలో కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని ప్రదీప్ రావు అన్నారు.