బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా గురించి పరిచయాలు అవసరం లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. మొదట మోడలింగ్ ద్వారా కెరిర్ ను ఆరంభించిన ఈషా.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో గెలిచింది. దీంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కాగా ప్రస్తుతం ఈషా పలు హిందీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తుంది.
View this post on Instagram
ఈ నేపథ్యంలోనే ఈషా మొదట ‘జన్నత్’ అనే సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుదీర్ఘకాలం పాటు ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది ఈషా గుప్తా.
బాలీవుడ్ నటి ఈషా గుప్తా.. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తూంటుంది. తన హాట్ లుక్స్‌తో కుర్రకారును కట్టి పడేస్తుంది. ఇటీవలే జరిగిన బాలీవుడ్ ప్రేమ జంట అలీ ఫాజల్-రిచా రిసెప్షన్‌కు ఈ అమ్మడు హాజరైంది. ఆ సమయంలో ఈషా ధరించిన గోల్డెన్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది. తన అందంతో అందర్నీ కట్టిపడేసింది.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసింది ఈషా. అయితే ఈషా ధరించిన ఈ గోల్డ్ కలర్ లెహెంగా ధర ఎంత ధర ఉంటుందని అభిమానులు నెట్టింట వెతికారు. దాని ధర తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ లెహెంగా కాస్ట్ అక్షరాలా రూ. నాలుగు లక్షలంట.