ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేన్స్. అందుకే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడం ఒక గౌరవంగా ఫీలవుతారు సినిమావాళ్లు. ఎవరో అగ్రస్థాయి నటీనటులకు, టెక్నీషియన్స్ కి మాత్రమే ఈ అవకాశం లభిస్తూ ఉంటుంది.
అందుకే ఇక్కడ వెరైటీ డ్రస్సులు వేసుకుని రెడ్ కార్పెట్ మీద నడవడం అంటే సినీ తారలకు ఓ పండగ. 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన అనుభవంపై నటి ఈషా గుప్తా తన అనుభూతిని వ్యక్తం చేసింది.వైట్ ప్లంగింగ్ గౌను ధరించి సెక్సీగా కనిపించిన బోల్డ్ బ్యూటీ.. పూల అలంకారాలతో పాటు ప్రత్యేకమైన కాలర్ కలిగిన దుస్తుల్లో అట్రాక్ట్ చేసింది.
‘ఆ సమయంలో నేను చాలా ఉద్విగ్నంగా ఉన్నాను. నాలో ఏదో తెలియని గందరగోళం మొదలైంది. రెడ్ కార్పెట్‌పై ఎలాంటి తప్పు జరగదనే నమ్మకంతోనే ముందడుగు వేశాను.
అనుకున్నట్లుగానే నా దుస్తులకు భారీ స్పందన వచ్చింది. నిజంగా ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేదు. నా గౌను సెక్సీగా ఉందని, నేను దేవదూతగా కనిపించానని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది.
ఇలాంటి ఉత్తమ దుస్తులు ధరిస్తానని ఎన్నడూ ఊహించలేదు. ఈ గౌను తయారు చేస్తున్నపుడు సెక్సీగా ఉంటుందని మాత్రమే నాకు తెలుసు’ అంటూ మురిసిపోయింది.