హైదరాబాద్ : ఈఎస్ఐ మందుల కొనుగోలులో భారీ స్కాం బయటపడింది. ఏక కాలంలో 23 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ, ఏడీ వసంత, ఫార్మా కంపెనీల ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. అవసరం లేకపోయినా రూ. 300 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 10 వేల మందులకు దేవికారాణి రూ. లక్ష క్లెయిమ్ చేసినట్లు ఏసీబీ విచారణలో స్పష్టమవుతోంది. దేవికారాణి బినామీ పేర్లతో మందులు కొనుగోలు చేసింది. అర్హత లేని ఏజెన్సీల నుంచి మందుల కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని దేవికారాణి డ్రగ్స్ అండ్ డ్రెస్సింగ్ మెటీరియల్‌లో అవకతవకలు జరిగాయి. ఈ ఎస్‌ఐ స్కాంలో దేవికారాణితో పాటు 17మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు, ఓ చానెల్ రిపోర్టర్, నలుగురు ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దేవికారాణి అండతో ఏడాదిలో ముఠా చెలరేగిపోయారు. ముఠా 26 కొనుగోలు ఉత్తర్వులు రద్దు చేసి కొత్త బినామీ ఆర్డర్లు సృష్టించారని ఏసీబీ డీజీ చెబుతున్నారు. మరికొంతమంది ఇళ్లపై, కార్యాలయాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.