సీఎం కేసీఆర్ తనకు ఆరు నెలలపాటు నరకం చూపిస్తే, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మర్రిగూడెం మండలం లంకెలపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తుల ఉమ, ఆచారి, దయానంద్ లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… లెంకల పల్లికి సీఎం కేసీఆర్ ఇంఛార్జి అని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ ఇజ్జత్ పోవద్దని ఒక్కో ఓటుకు రూ. 1 లక్ష ఇస్తాడేమో అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ఇచ్చినా ఆ డబ్బును తీసుకోండంటూ ఆయన తెలిపారు. .
ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టే వ్యక్తి కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడిస్తే కేసీఆర్ పాలన అంతమవుతుందన్నారు. దీంతో కేసీఆర్ పీడ విరుగుడు అవుతుందని ఫైర్ అయ్యారు. మునుగోడుకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రెడీనా అని సవాల్ విసిరారు.
రాచరిక వ్యవస్థలో రాజు సైతం ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని మారు వేషంలో వెళ్లి తెలుసుకునే వారన్నారు. కానీ ఈ సీఎం ప్రగతి భవన్ లోనే ఉంటారన్నారు. ఇనుపకంచె, ఆ వెనుక ఇనుప ముళ్ళు వేసుకొని ఇనుప బూట్ల మధ్య ఉంటాడని ఎద్దేవా చేశారు.
సంక్షేమ హాస్టల్స్‌లో పిల్లలు చనిపోతున్నా కూడా ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ బయటికి విమానాలు కొనేంత డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఆయ ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మునుగోడు అడబిడ్డల మీద ఉందన్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలిచినట్టని ఆయన అన్నారు.