హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్, ఈటల శిబిరాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దళిత బంధు పథకంతో కేసీఆర్ ముందుకు సాగుతుండగా… బీసీ కులాల సమావేశాలు ఏర్పాటు చేస్తూ మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లోనే మకాం వేశారు.
దీంతో వీరికి చెక్ పెట్టేందుకు మాజీ మంత్రి ఈటల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే పనిచేస్తుందని… బీసీ బిడ్డగా ఉన్న తనకు అండగా ఉండాలని ఈటల కోరినట్లు తెలుస్తోంది. కులాల పేరుతో కేసీఆర్ ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా హుజురాబాద్ ప్రజలు ధర్మం వైపే ఉంటారని ఈటల వ్యాఖ్యానించారు. అక్రమార్కులకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు.