బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆయన బాంబు పేల్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తనకు బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించిందన్నారు. త్వరలో ఎవరి ఊహకూ అందనంత స్థాయిలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
తన తదుపరి టార్గెట్ సీఎం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ను ఓడించడమే తన జీవిత లక్ష్యమని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అద్వానంగా తయారయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అస్వస్థతకు గురవుతున్నారని మండిపడ్డారు.