కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, వరుస చిత్రాలతో మంచి హిట్ లను అందుకున్నాడు. త్వరలో ఎతర్క్కుం తునిందావన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 10, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరి 18, సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అదే విషయాన్ని చెబుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించింది.
ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది.