ప్రతి పండగకు, ప్రతి స్పెషల్‌డేకు మల్లెమాల రూపోందించే స్పెషల్ ఎంత సూపర్ హిట్ అవుతుందో అందిరికీ తెలుసు. అయితే ఈ సారి నాగబాబు అండ్ టీం వెళ్లిపోయాక వస్తోన్న మొదటి స్పెషల్ డే న్యూ ఈయర్. ఈసారి ప్రోగ్రాం ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో… విడుదలైన కొత్త ప్రొమో అందరినీ అలరిస్తోంది.
ఈ స్పెషల్‌లో యాంకర్‌గా అవతారం ఎత్తిన హైపర్‌ఆదికి జతగా వర్షిణీ ఉండటంతో.. వీరిద్దరి మధ్య పంచ్‌లు అందరినీ అలరిస్తున్నాయి. అంతేకాదు ఆదిని వర్షిణి ఎత్తుకోవటంతో… ఆది సంబురపడుతూ వేసే పంచ్‌లు, జానీ మాస్టర్-యానీ మాష్టర్ స్టెప్పులు అన్నీ ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
ఇక జర్నలిస్ట్ జాఫర్‌ను కూడా ఈ వేడుకలో భాగం చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత జాఫర్ పార్టిసిఫెట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో… జబర్ధస్త్ జడ్జికి వేసిన పంచ్ వైరల్ అవుతోంది. రోజాను ఉద్దేశిస్తూ టీవీషోలకు ఎక్కువ సమయం, ప్రజలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని బయట ప్రచారం ఉందన్న దానిపై మీ స్పందన ఏంటని ప్రశ్నిస్తాడు. దీనిపై రోజా సీరీయస్ అయినట్లు కనపడుతోంది.
ఇలా కామెడీ పంచ్‌లు ఒకవైపు, డాన్స్‌లతో హాంగామా మరోవైపు… రోజాకు సూటి ప్రశ్నలతో షో మరింత ఆకట్టుకోబోతుంది. అయితే, దీనికి పోటీగా మాజీ జబర్దస్త్ జడ్జి నాగబాబు ఎలాంటి షోతో వస్తారో చూడాలి.