యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేప్టీ ఏజెన్సీ…తమ దేశంలో యెల్లో మీల్‌వార్మ్స్ అనే కీటకాలను తినేందుకు అనుమతినిచ్చింది. యెల్లో మీల్‌వార్మ్స్ అనే కీటకాల్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ వంటి పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తినేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు!
ఈ కీటకాలను పక్షులు ,తొండలు తమ ఆహారంగా తినేవి! ఇప్పుడు మనుషులు సైతం వాటికి పోటీగా తినడానికి రెడీ కాబోతున్నారన్నమాట! వాస్తవానికి యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి నుండి ఈ కీటకాలను ఫ్రైగా చేసుకొని తింటున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఇది అన్ని హోటల్ మెనూ లలో కొత్తగా చేరబోతుందన్నమాట!