ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో యురోపియన్ యూనియన్(ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ తెలిపారు.
రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆ దేశంపై అదనపు ఆంక్షలు విధించాలని రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రష్యా పాలకులకు ఇవి బాధాకరంగా మారుతయని వెల్లడించారు.
ఉక్రెయిన్ ప్రజలకు సహకరించాలన్న నిర్ణయానికి తాము వచ్చినట్టు చెప్పారు. ఆర్థిక సామార్థ్యాన్ని కూడగట్టుకునేందుకు ఆ దేశానికి సహకరిస్తామని అన్నారు.
రష్యాలోని బ్యాంకింగ్ సెక్టార్, ఇతర రంగాల పై ఈ నూతన ఆంక్షల ప్రభావం 70శాతం వరకు పడుతుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాండెర్ లియాన్ పేర్కొన్నారు.