ఏ వ్యక్తైనా వారి స్థాయిని బట్టి వ్యవహరించాలి. అలాంటి ప్రవర్తన వారికి మరింత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొంత మంది ఎంత స్థాయికి వెళ్ళినా బుద్ధి వక్రంగానే ఉంటుంది. హుందాగా వ్యవహరించలేక తుంటరి పనులు చేస్తూ నైతికంగా పతనమై పోతుంటారు.
తాజాగా ఓ ప్రముఖ నటి ఒక స్టోర్లో ‘లోదుస్తులు’ దొంగిలిస్తూ దొరికిపోయింది. అయితే ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసం అనుకుంటే పొరపాటే. కేవలం రూ. 2 వేలకు కక్కర్తి పడి ఈ పని చేసిందట. పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటపడింది.
విషయమేంటంటే…అమెరికాకు చెందిన హీరోయిన్ క్లోయి చెర్రీకి పాపులారిటీ బాగానే ఉంది. ఆమె కొద్దిరోజుల క్రితం పెన్సెల్వేనియాలోని లాన్ కాస్టర్ లోని ఓ రీటైల్ స్టోర్ కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తున్న సమయంలో దాదాపు 2 వేల రూపాయాలు విలువ చేసే ఓ బ్లౌజ్ ను దొంగతనం చేసింది.
ఆతర్వాత షాపులోని ఓ ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తించి ఆమెను ప్రశ్నించగా..తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సదరు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని ఆమెను ప్రశ్నించగా.. దొంగతనం అంగీకరించింది.
దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనిపై హీరోయిన్ ప్రతినిధి స్పందిస్తూ.. ఇది పొరపాటు వల్ల జరిగిందని.. ఆమెకు అలాంటి ఉద్ధేశ్యం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.