బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో చేసినా సరే ఆయన ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఉంటారనే మాట వాస్తవం. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఆస్తి పాస్తులు కూడా ఆయనకు బాగానే ఉన్నా ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటారు అనే టాక్ ఉంది. చాలా మంది హీరోల కంటే కూడా క్రేజ్ ఉన్నా సైలెంట్ గానే ఉంటారు.
ఇక ఆయన అలవాట్లు అన్నీ కూడా కాస్త ఆసక్తిగా ఉంటాయి. భారీ నివాసాలు ఉన్నా సరే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోనే ఆయన నివాసం ఉంటారని అంటారు. ఇక నేల మీద కూర్చునే భోజనం చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చినా సరే అందరితో కలిసి ఆయన నేల మీదనే భోజనం చేస్తారు. సినిమా షూటింగ్ ఉంటే దాదాపుగా ఇంటి నుంచే భోజనం కూడా తీసుకువెళ్తారు. పార్టీలు, ఎంజాయ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉంటారట.
ఆయనకు భారీ ఫాం హౌస్ కూడా ఉందని చెప్తారు. ముంబై శివారుల్లో అత్యంత విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నారు గాని… ట్రాఫిక్ కారణం తో ప్రతీ రోజు సిటీలోకి రాలేను అని భావించి సిటీ మధ్యలో ఉన్న అపార్ట్ మెంట్ లో ఉంటారట. ఇక ఇష్టపడి 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొలంలో ఒక భారీ ఫాం హౌస్ కూడా కట్టించుకున్నారు ఆయన. ఏడు బెడ్ రూమ్ లో ఉండే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండటం లేదట. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే హాలి డే ట్రిప్ గా వెళ్లి వస్తారట.