ఈ రోజుల్లో ఎంత అందంగా ఉన్నా సరే సినిమాలో మేకప్ అనేది ఉండాల్సిందే అనే మాట వాస్తవం. అగ్ర నటులు అయినా సరే మేకప్ లేకుండా నటించే పరిస్థితి లేదు. అవసరం అయితే విగ్ కూడా పెట్టుకోవాలి. హీరోయిన్లకు కూడా విగ్ లు పెడుతూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం అప్పట్లో మేకప్ లేకుండానే సినిమాలు చేసేవారు. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా సరే ఆమె మేకప్ వేసుకునేవారు కాదు.
Also Read:అమెరికెన్ కామెడీ డ్రామాకి 10 ఆస్కార్ నామినేషన్ష్…!?
ఆమె ఎవరో కాదు… అప్పట్లో సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కన్నాంబ. తొలితరం హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలిగారు. మంచి సినిమాల్లో కీలక పాత్రలు చేసారు. ఆ తర్వాత తనను జనం హీరోయిన్ గా చూడరు అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఎన్టీఆర్, అక్కినేని సినిమాల్లో ఆమె అమ్మ, వదిన, అత్త పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.
కొన్ని సందర్భాల్లో షూటింగ్ కి కూడా ఆమె ఆలస్యంగా వచ్చేవారు. ఇక మేకప్ లేకుండానే నటించిన ఆమె… కొన్ని కొన్ని సినిమాల్లో డైరెక్ట్ గా వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నారు. డైలాగ్ షీట్ చూసి సందర్భం తెలుసుకుని తానే సొంతంగా డైలాగ్ లు చెప్పెసేవారు. రచయితలు రాసిన వాటి కంటే ఆమె మాటలు ఇంకా బాగుండేవి అంటారు. ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆమె మేకప్ లేకుండా నటించారు. మేకప్ ఎందుకు వేసుకోలేదు అని ఎన్టీఆర్ దర్శకుడుని అడిగితే… చందమామకు మేకప్ ఎందుకు అని అన్నారట.
Also Read:అమెరికెన్ కామెడీ డ్రామాకి 10 ఆస్కార్ నామినేషన్ష్…!?