ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎల్జీ తనకు వరుసగా లేఖలు రాయడంపై ఆయన వినూత్నంగా కౌంటర్ వేశారు. ఎల్జీ తిట్టినట్టు తన భార్య కూడా తనను తిట్టదన్నారు.
గడిచిన ఆరు నెల్లలో ఎల్జీ రాసినన్ని ప్రేమలేఖలు తన భార్య కూడా రాసి ఉండదని ఎద్దేవా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేదాభిప్రాయాల నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు ఎల్జీ వరుస లేఖలు రాస్తుండటంపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఎల్జీ గారు కాస్త శాంతించాలని కోరారు. మీ సూపర్ బాస్‌ను కూడా కొంచెం ప్రశాంతంగా ఉండమనండంటూ ఆయన కోరారు. ఇటీవల మహాత్మా గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్, విజయ్ ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.
కార్యక్రమాలకు సీఎం గైర్హాజరు కావడంపై ఆరా తీస్తూ అరవింద్ కేజ్రీవాల్ కు ఎల్జీ వీకే సక్సేనా లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఆయన లేఖలో తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ యంత్రాంగం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సీఎం పాల్గొనక పనోవడం ఆమోద యోగ్యం కాదని ఆయన అన్నారు.