రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహశీల్దార్ ప్రవేశించడం పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఒక్క విషయం చాలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని గురించి చెప్పడానికి.
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన.. మహిళా ఐఏఎస్ కే రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డయల్100 అని ఐఏఎస్ అధికారిణి అంటుంటే.. కేసీఆర్ 100 పేపర్ బ్రాందీ అంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డారని స్వయానా అధికారిణే ట్వీట్ చేశారు. ఎంతో చాకచక్యంగా తన ప్రాణాలు కాపాడుకున్నాని చెప్పారు. అందరూ రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిన్న రాత్రి ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి చొరబడ్డ మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది.
సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం.
ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త!@TelanganaCMO @hydcitypolice @TelanganaDGP https://t.co/UjrESVzb7G
— Revanth Reddy (@revanth_anumula) January 22, 2023