టాలీవుడ్ లో పూజ హెగ్డే డిమాండ్ ఇప్పుడు బాగా తగ్గింది. వరుస ఫ్లాప్ సినిమాలతో ఆమె ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అగ్ర హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు వరుస అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో అటు కన్నడం లో కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు పూజ. ఇక ఇప్పుడు తమిళంలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆమె.
అయితే అక్కడ కూడా అనుకున్న విధంగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో కొత్త హీరోయిన్ల హవా కాస్త పెరగడంతో ఆమె సైలెంట్ అయిన పరిస్థితి ఉన్న మాట వాస్తవం. దీనితో రెమ్యునరేషన్ కూడా భారీగా పడిపోతుంది అనే చెప్పాలి. యువ హీరోల సినిమాల్లో కూడా నటించే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయినా సరే ఆమెను తీసుకోవడానికి దర్శకులు ముందుకు రావడం లేదు అనే చెప్పాలి.
ఇదిలా ఉంచితే ఇప్పుడు పూజ హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో తగ్గడం లేదని అంటున్నారు. తమిళంలో విశాల్ హీరోగా చేసే సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. అందుకోసం దాదాపుగా 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ సినిమా దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో వస్తుంది. అందుకనే ఆమె ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది. తెలుగులో మహేష్, త్రివిక్రమ్ సినిమాలో కూడా చేయనుంది.