ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ ఓటమికి అగ్రనాయకులే కారణమంటూ పలువురు సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి కేవలం అగ్ర నాయకత్వం మాత్రమే కారణం కాదనీ, ఓటమికి పార్టీకి చెందిన ప్రతి ఎంపీ, రాష్ట్ర నాయకుడు భాద్యులేనని ఆయన అన్నారు.
తమకు సోనియా నాయకత్వంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. ఆమె రాజీనామా చేసే ప్రశ్నే తలెత్తదని అని ఆయన వెల్లడించారు.
బీజేపీ, దాని సిద్దాంతాలపై తాము పోరాటం చేస్తామని, తదుపరి ఎన్నికల్లో తమ పార్టీ సిద్దాంతాలను మరింత ముందుకు తీసుకు వెళతామని అన్నారు. తాము మునుపటి కంటే మెరుగ్గా పని చేస్తామని చెప్పారు.