ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నువ్వు నేను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అంతే కాకుండా నటుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అంతే కాకుండా ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.
నువ్వు నేను సినిమా కి గాను మొదట చూసుకుంటే ఉత్తమ దర్శకుడిగా తేజ కి నంది అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా అన్ని విభాగాల్లో ఐదు నంది అవార్డులు వచ్చాయి. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. తేజకు స్టార్ డైరెక్టర్ అనే పేరును కూడా ఈ సినిమా తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన చాలామంది నటీనటులు ఇప్పుడు లేరు. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అలాగే ఆహుతి ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు.
రాజశేఖర్ కూతురి మెడికల్ కోసం చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?
ఎమ్ ఎస్ నారాయణ… ఈయన కూడా ప్రాణాలు కోల్పోయారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం… ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే అనారోగ్యంతో సుబ్రహ్మణ్యం కూడా మృతిచెందారు.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడంటే..?
ఇక హీరో తండ్రి పాత్ర పోషించిన వైజాగ్ ప్రసాద్ కూడా మృతి చెందారు. ఇలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారంతా కూడా మృతి చెందారు. వీరంతా కూడా ఇప్పుడు లేకపోటం నిజంగా బాధాకరం.