ట్రిపుల్ ఆర్ సినిమా దర్శక ధీరుడు రాజమౌళికి, హీరోహీరోయిన్స్,ఇతర సాంకేతిక వర్గానికి ఎంత కిక్ ఇచ్చిందో తెలీదుగానీ దేశానికి మాత్రం మాంచి కిక్కిచ్చింది. నాటు నాటు పాట పెద్దహిట్టయ్యి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. తాజాగా సమాచారం ప్రకారం ఆస్కార్ కి అడుగు దూరంలో ఉంది. అదే గనక జరిగితే ప్రతి భారతీయుడి గుండెల్లో నాటుకుపోతుంది నాటునాటు పాట. ఒక్కపాటకే మనం ఉబ్బితబ్బిబ్బైపోతుంటే ఒక అమెరికెన్ సినిమా 10 విభాగాల్లో నామినేట్ అయిఉంది. మరి ఈ సినిమా వాళ్ళకి ఎన్ని టన్నుల కిక్కిచ్చి ఉంటుందో మీరే అంచనా వెయ్యండి.
దాని బడ్జెటు, లెక్కలు వగైరా వేరనుకోండి. 95వ ఆస్కార్స్ లో అత్యధిక సామినేషన్స్ పొందిన సినిమా ఇది. అమెరికన్ కామెడీ డ్రామా అయిన “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీ మొత్తం పది కేటగిరిల్లో నామినేట్ అయ్యింది.
బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది.
డానియెల్ క్వాన్, డానియెల్ షీనర్ట్ లు దర్శకత్వం వహించిన విభాగాల్లో “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్”మూవీలో ‘మిచ్చేల్ యోవ్’ మెయిన్ లీడ్ ప్లే చేశారు. మార్చ్ 25న అమెరికాలో రిలీజ్ అయిన ఈ మూవీ 25 మిలియన్ డాలర్స్ బడ్జట్ తో తెరకెక్కి 104 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది.
గోల్డెన్ గ్లోబ్ నుంచి క్రిటిక్స్ సర్కిల్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇలా పోటీ చేసిన ప్రతి చోటా విభాగాల్లో “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్”సినిమా అవార్డులు గెలిచింది. మార్చ్ 12న కూడా విభాగాల్లో “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్”మూవీ తక్కువలో తక్కువ ఆరు ఆస్కార్స్ అయినా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఒక తల్లి-కూతురి కథతో తెరకెక్కిన విభాగాల్లో “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్”సినిమా ఈ ఏడాది ఇంటర్నేషనల్ సినిమాని ఏలుతుంది. ఒకవేళ ఈ మూవీ చూడాలి అనుకుంటే “లయన్స్ గేట్ ఒటీటీ”లో అందుబాటులో ఉంది చూసి ఎంజాయ్ చెయ్యండి.