• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ‘విజన్-2047’ మన లక్ష్యం: చంద్రబాబు

‘విజన్-2047’ మన లక్ష్యం: చంద్రబాబు

Last Updated: January 26, 2023 at 6:24 pm

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం చంద్రబాబు జాతీయ జండా ఆవిష్కరించారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మంచిది అయినా దాన్ని అమలు పరిచేవాళ్లు మంచివాళ్లు కాకపోతే ఫలితం ఉండదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని అన్నారు.

యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని అమలు చేయాలన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుందన్నారు. ఇప్పుడే ‘విజన్-2047’ సిద్ధం చేసుకుని.. ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా.. దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుందని పేర్కొన్నారు.

ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో ఉన్నతస్థాయికి భారతీయులు చేరుకున్నారు. అమెరికన్ల తలసరి ఆదాయం 65 వేల డాలర్లు కాగా.. ఇండియన్స్ తలసరి ఆదాయం 1,19,000 డాలర్లుగా ఉండడం మన దేశ పౌరుల సమర్థతకు నిదర్శనమన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింతగా రాణించే అవకాశాలు ఉన్నాయి.

పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాల్సి ఉందని అన్నారు. నేషన్ ఫస్ట్ అనే సిద్దాంతంలో పౌరులు, ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు. యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్ చేరుకోవడం తథ్యమని అన్నారు. ‘విజన్-2047’తో ప్రణాళికా బద్దంగా ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Primary Sidebar

తాజా వార్తలు

తారలు దిగి వచ్చిన వేళ!

‘సావర్కర్ త్యాగనిరతిని కాదనలేం.’.. శరద్ పవార్ మెలిక

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఫిల్మ్ నగర్

aliya to priyanka chopra actresses who stole the show with loads of shimmer at nmac opening

తారలు దిగి వచ్చిన వేళ!

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో  సమ్మర్   వెకేషన్ కి   వెళ్ళిన  పవన్ ...!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap