కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీయూ- కాంగ్రెస్ మధ్య మాటల తుటాలు పేలుతున్న దశలో… మాజీ సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తో చేతులు కలపటం వల్ల తన 12ఏళ్ల రాజకీయ జీవితం నాశనమయ్యిందన్నారు. తనపై సిద్ధరామయ్య అనేక కుట్రలు పన్నారని… అందుకే కన్నీరు కార్చాల్సి వచ్చిందన్నారు. కానీ తను సీఎంగా ఉన్నప్పుడు వాటిని గుర్తించలేకపోయానన్నారు.
కాంగ్రెస్ తో చేతులు కలపటం వెనుక తండ్రి దేవెగౌడ ఉన్నారని అంగీకరించిన కుమారస్వామి… బీజేపీతో సన్నిహితంగా ఉంటే తనకు మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో ఓసారి బీజేపీ మద్దతుతో కుమార స్వామి కొంతకాలం సీఎంగా పనిచేశారు.
అయితే, వీటిని సిద్దరామయ్య తీవ్రంగా ఖండిస్తూ… అబద్ధాలు చెప్పటంలో ఆ కుటుంబం ఆరితేరిందన్నారు.