సీఎం జగన్ దీర్ఘకాలిక వ్యూహాంలో భాగంగానే విశాఖలో పరిపాలన రాజధాని అంటూ ప్రకటించారని బాంబు పేల్చారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. శాసన సభ తాయిలం చూపి మొదట పరిపాలన రాజధానిని విశాఖకు మార్చటం, ఆపై అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ముందు కుదించటం క్రమంగా ముగించటం సులభమని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో విశాఖ రాజధాని అవుతుందని, హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్లు కేటాయిస్తే సరిపోతుందని మాజీ సీఎస్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ క్లాస్ సెక్రటెరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇలా రాజధానికి కావాల్సిన భవనాలు, మౌలిక సదుపాయాలు తక్కువ వ్యయంతో నిర్మించవచ్చని అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ శాసనసభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన, అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో… నిపుణుల కమిటీ సీఎం జగన్‌తో భేటీ కాబోతుంది. రాజధానిపై తుది నివేదిక ఇవ్వనుంది.