ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసేలా ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న వార్తలపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించలేమని, ఎస్‌ఈసీ వైఖరిని తప్పుబడుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టబద్దతకు ప్రయత్నిస్తే అవివేకమైన చర్య అవుతుందని ప్రభుత్వంపై ఐవైఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ బాధ్యతల గురించి రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, దానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టుల్లో కొట్టేయడం తథ్యమని వ్యాఖ్యానించారు.
ఇటువంటి చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అవివేకమైన చర్యే అవుతుందన్నారు. రాజ్యాంగం స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ స్థాయిని, బాధ్యతలను, అధికారాలను నిర్వచించిన తర్వాత చట్టం దానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టుల్లో ఆచట్టాలు నిలవటం కష్టమని… అప్పుడు మళ్లీ కోర్టులను నిందిస్తే లాభం లేదని ఐవైఆర్ చురకలంటించారు.