అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు భయటపడుతూనే ఉన్నాయి. ఎన్నికలు వచ్చే చోటే కాదు ఇతర చోట్లలోనూ నేతలు ఒక్కొక్కరుగా భయటకు వస్తున్నారు. తాజాగా కరీంనగర్ కార్పోరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, కౌన్సిలర్ భర్త రమేష్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
గుగ్గిలపు రమేష్ గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేయగా… మొన్నటి ఎన్నికల్లో ఆయన భార్య కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వీరు తమ రాజీనామా లేఖను మంత్రి గంగుల కమలాకర్ కు పంపారు. దీంతో స్థానిక నేతలతో సమావేశం అయిన మంత్రి గంగుల… పార్టీని వీడి వెళ్లే వారిని బుజ్జిగిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
గుగ్గిలపు రమేష్, ఆయన వర్గం నేతలంతా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.