కేరళ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయనను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల జరిగిన ఓ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముస్లిం రెస్టారెంట్లలో లభించే డ్రింక్స్ ను తీసుకోవద్దని సూచించారు. హిందువులను నపుంసకులుగా మార్చేందుకు అందులో మెడిసిన్ కలుపుతున్నట్టు ఆయన ఆరోపించారు.
అలా చేసి తమ బలాన్ని పెంచుకోవాలని ముస్లింలు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ముస్లిమేతరులు ఆ రెస్టారెంట్లకు వెళ్లవద్దని సూచించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Advertisements
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయనను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.