ఏపీలో పోలీసుల తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేయటం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. పాలకొండ డిఎస్పీ , టెక్కలి సిఐ లు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నేను హోం మినిస్టర్ పదవి తీసుకిని తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల సంగతి తెలుస్తానంటూ హెచ్చరించారు. బెడ్ రూమ్ లో ఉన్న నన్ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండ అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాకీ డ్రెస్ అంటే అసహ్యం వేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించి, ఆ తర్వాత కోర్టులో హజరుపర్చే ముందు కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోటబొమ్మాళి ఆసుపత్రి వద్దే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.